Breaking News

ప్రభాస్‌ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు

Published on Sun, 06/08/2025 - 14:34

సినిమా కోసం కొన్నిసార్లు విన్యాసాలు చేయక తప్పదంటున్నాడు బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher). అదేదో సినిమాలో స్టంటనుకునేరు, కానే కాదు సినిమా సెట్‌కు వెళ్లేందుకు స్టంట్‌ చేయాల్సి వచ్చింది. అనుపమ్‌ ఖేర్‌.. ప్రభాస్‌ ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. అయితే సెట్‌లోకి వెళ్లేందుకు అనుపమ్‌ గోడ దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

ఇదే తొలిసారి
నా 40 ఏళ్ల జర్నీలో ఎన్నో రకాలుగా షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లాను. కానీ ఈరోజు ఇలా సెట్‌కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి, ప్రత్యేకం కూడా! హైదరాబాద్‌లో ప్రభాస్‌ సినిమా షూటింగ్‌ సెట్‌కు బయలుదేరాం. మా డ్రైవర్‌ దాన్ని సాహసోపేతంగా మార్చాలనుకున్నాడేమో బహుశా.. ఏకంగా అడవిలాంటి ప్రదేశంలోకి తీసుకొచ్చాడు. తీరా డెడ్‌ ఎండ్‌కు చేరుకున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. 

గోడ దూకి సెట్‌లోకి..
కారు రివర్స్‌ తీద్దామని ప్రయత్నించినా వీలు కాలేదు. మా పక్కనే సినిమా షూటింగ్‌ జరుగుతోంది. దీంతో గోడ దూకి సెట్‌లోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన జనాలు.. కెరీర్‌ తొలినాళ్లలో ముసలి వ్యక్తిగా నటించారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో అడవిలో ఈ స్టంట్లు చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.

 

 

చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్‌బీ..

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)