ఇండస్ట్రీలో నన్నూ అలాంటి కోరికే కోరారు: ఇమ్మానుయేల్‌

Published on Mon, 08/28/2023 - 06:58

సినీ పరిశ్రమలో సర్దుకుపోవడం (కాస్టింగ్ కౌచ్) అనే పదం ఇటీవల మళ్లీ ఎక్కువగా వినిపిస్తోంది. నటి అను ఇమ్మానుయేల్‌ కూడా అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాను అని పేర్కొంది. చదువుకునే రోజుల్లోనే బాలనాటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత 2016లో నిఫిన్‌ బాలికి జంటగా యాక్షన్‌ హీరో బిజూ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయింది. ఆ తర్వాత 2016లోనే 'నాని' కథానాయకుడిగా నటించిన 'మజ్ను' చిత్రంలో కిరణ్మై పాత్రలో మెప్పించింది. 

ఆ తర్వాత కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ సరసన 'నమ్మవీట్టు పిళ్లై' చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం తర్వాత అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే ఆ చిత్రం విజయాన్ని సాధించిన అను ఇమ్మానుయేల్‌ను మాత్రం అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ఇక్కడ స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా అజ్ఞాతవాసి,నా పేరు సూర్య,గీత గోవిందం వంటి సినిమాలు చేసినా  ఈ అమ్మడిని ఎప్పటికీ స్టార్‌ ఇమేజ్‌ వరించలేదని చెప్పాలి.

తాజాగా కార్తీక్‌ జంటగా 'జపాన్‌' చిత్రంలో నటించింది. త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఈ చిత్రంపై అను ఇమ్మానుయేల్‌ చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సర్దుకుపోవడం అనే అంశంపై స్పందిస్తూ. అను ఇమ్మానుయేల్‌ తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. అయితే ఇలాంటి ఘటనలను కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కొన్నానని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో సమస్యను ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


    

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)