Breaking News

జయసుధ ఫోన్‌ లాక్కున్న మోహన్‌ బాబు.. స్పీచ్‌ వైరల్‌

Published on Wed, 09/20/2023 - 16:11

విలక్షణ నటుడు మోహన్‌బాబు క్రమశిక్షణకు మారుపేరు. తను మాత్రమే కాదు, తన చుట్టుపక్కలవారు కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు. బుధవారం (సెప్టెంబర్‌ 20) నాడు తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు మోహన్‌బాబు హాజరయ్యారు. ఈ క్రమంలో తన పక్కనే కూర్చున్న జయసుధ అతిథులు మాట్లాడుతున్న ప్రసంగం వినకుండా ఫోన్‌ చూస్తూ ఉంది.

ఫోన్‌తో జయసుధ ఆటలు
దీంతో మోహన్‌బాబు ఈ సమయంలో ఫోన్‌ చూడటమేంటి? అన్నట్లుగా దాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్‌ అయిన జయసుధ నవ్వుతూ ఫోన్‌ చూడటం ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏఎన్నార్‌ గురించి మాట్లాడేటప్పుడు ఫోన్‌ వంక చూడటం కరెక్ట్‌ కాదు కదా.. మోహన్‌బాబు చేసింది కరెక్టేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చొక్కా చించుకుని వెళ్లా
ఇక అక్కినేని నాగేశ్వరరావు గురించి మోహన్‌ బాబు ప్రసంగిస్తూ.. 'ఏఎన్నార్‌ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఆయన సినిమా 100 రోజుల ఫంక్షన్‌ జరుగుతుందంటే చొక్కా చించుకుని మరీ వెళ్లేవాడిని. మళ్లీ ఆ చొక్కా కొనడానికి కూడా డబ్బులుండేవి కాదు. అటువంటిది ఆయన నటించిన మరపురాని మనిషి సినిమాకు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. ఇది భగవంతుని ఆశీర్వాదం.  ఆ తర్వాత ఆయన బ్యానర్‌లో ఎన్నో సినిమాల్లో నటించాను. ఓసారి నాగేశ్వరరావు- అన్నపూర్ణమ్మ పక్కపక్కనే కూర్చున్నప్పుడు నేను వెళ్లాను. ఆమె నన్ను చూసి ఫలానా సినిమాలో బాగా నటించావని ఆశీర్వదించిస్తే ఆయన కసురుకున్నారు.

నా కోరిక తీర్చారు
వాడేమైనా గొప్ప నటుడని ఫీలవుతున్నావా? వాడికి ముందే పొగరు. ఎందుకు? వాడి గురించి పొగుడుతున్నావని ఆమెపై కోప్పడ్డారు. తర్వాతి రోజు నేను సెట్‌కు ఆలస్యంగా వెళ్లాను. అప్పుడో విషయం చెప్పాను.. నాకు ఓ కోరికుంది సార్‌.. ప్రతిసారి మీరొస్తే మేము నిలబడటమేనా? నేను వచ్చినప్పుడు మీరు లేచి నిలబడాలని కోరుకుంటున్నా అన్నాను. నా కోరిక విని ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాతి రోజు సెట్‌కు వెళ్తే దాసరి, ఏఎన్నార్‌.. ఇద్దరూ నా కోరిక తీర్చేందుకు లేచి నిలబడ్డారు. ఇలా ఆయనతో ఎన్నో సరదా సంఘటనల అనుభూతులున్నాయి. ఏఎన్నార్‌ ఒక గ్రంథం, ఒక పాఠ్య పుస్తకం. అటువంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఉండటం చాలా సంతోషం' అని చెప్పుకొచ్చారు.

చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)