Breaking News

డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో మరో ఓటీటీ సంస్థ!

Published on Sun, 05/05/2024 - 11:27

ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారిందన్నది ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న చి త్రాల నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వరప్రసాదంగా మారాయనే చెప్పాలి. అలా ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెద్ద చి త్రాల స్ట్రీమింగ్‌లో బిజీగా ఉన్నాయి. కొత్తగా ఓటీటీ ప్లస్‌ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ ప్రారంభమైంది. ప్ర ముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కేబుల్‌ శంకర్, ఎంఆర్‌ శీనివాసన్, సుధాకర్‌ కలిసి ఈ ఓటీటీ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన దీని ప్రారంభోత్సవంలో జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత దర్శకుడు శీనూ రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరైన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

అదే విధంగా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల యంగ్ డైరెక్టర్స్‌ జాన్‌ కిళడి(పైరీ), మణివర్మన్‌(ఒరునొడి), ఆర్‌.వెంకట్‌(కిడా), బాలాజీ వేణుగోపాల్‌ (లక్కీమేన్‌), కన్నుసామి(వట్టార్‌ వళక్కు), యశ్వంత్‌ కిశోర్‌ (కన్నగి), విఘ్నేశ్‌కార్తీక్‌( హార్ట్‌స్పార్ట్‌) శరత్‌ జ్యోతి, రచయిత వసంత్‌ బాలక్రిష్ణన్, జయచంద్ర హస్మీ (కూస్‌ ముణుసామివీరప్పన్‌(వెబ్‌సిరీస్‌)ను అభినందించి వారికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓటీటీ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌ భవిష్యత్‌లో కొత్తగా వచ్చే వారికి వరప్రసాదం అవుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్థమాన దర్శకుల చిత్రాలను ప్రశంసించారు. వారిని తనతో గౌరవింపజేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఓటీటీ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్వాహకుల్లో ఒకరైన కేబుల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అవసరం నానాటికీ పెరిగిపోతోందన్నారు. అలా ఈ ఓటీటీ ప్లస్‌ మరో 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పని చేస్తోందని చెప్పారు. మరిన్ని ఓటీటీ సంస్థలను ఒకే ప్లాట్‌ఫామ్‌గా చేయాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. రోజుకు ఒక్క రూపాయి చెల్లించి ఈ ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌సిరీస్, లఘు చిత్రాలు చూడవచ్చని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కేబుల్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఫెమినిస్ట్‌ అనే వెబ్‌ సిరీస్‌ మొదటి ఎపిసోడ్‌ను, సెన్టెన్స్‌ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.  
 

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)