Breaking News

70కి పైగా ఆడిషన్స్‌.. కాంప్రమైజ్‌ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్‌

Published on Thu, 07/25/2024 - 13:25

అనూష కృష్ణ.. పేరుకు కన్నడమ్మాయే కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. పక్కింటమ్మాయిలా కనిపించే ఈమె ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ చదివింది. యాక్టింగ్‌ కోసం ఉద్యోగాన్ని మానేసింది. ఇంట్లోవాళ్లు తిట్టినా సరే ఇండస్ట్రీలో ప్రయత్నిద్దామన్న బలమైన కోరికతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పేకమేడలు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.

అవకాశాల కోసం అన్నీ చేయలేను
'నేను 70కి పైగా ఆడిషన్స్‌కు వెళ్లాను. కన్నడలో రెండు సినిమాలు చేశాను. కానీ ఇంకా రిలీజవ్వలేదు. కొన్ని ఆడిషన్స్‌లో మీరిలాగే చిన్న సినిమాలు చేస్తారా? పెద్ద చిత్రాలు చేస్తారా? అని ఆప్షన్స్‌ ఇస్తారు. వాళ్లు చెప్పినవాటికి తలూపి పెద్ద సినిమాలు నేను చేయలేను. నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. వాటిని దాటలేను. చిన్న సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పేదాన్ని.

చేదు అనుభవం
ఒకసారైతే భయంకరమైన సంఘటన జరిగింది. దర్శకనిర్మాతలు మాకు నచ్చేశావన్నారు. అయితే ఆ నిర్మాత వయసు సుమారు 60 ఏళ్లుంటుంది. ఆయన మీరు కాంప్రమైజ్‌ అయితే సినిమా చేసేద్దామన్నారు. భయంతో వణికిపోయాను. నాకు ఎంగేజ్‌మెంట్‌ అయిందని అబద్ధం చెప్పాను. అయినా పర్లేదన్నాడు. వెంటనే నేను క్యాబ్‌ బుక్‌ చేసుకుని వెళ్లిపోయాను. నేను బోరుమని ఏడుస్తుంటే ఆ కారు డ్రైవర్‌ ఏమైంది మేడమ్‌.. అంతా బానే జరుగుతుందని ఓదార్చాడు. పేకమేడలు షూటింగ్‌ అయిపోయాకే ఈ సంఘటన జరిగింది' అని అనూష తెలిపింది.

చదవండి: మోసపోయా.. ఇప్పటికీ నాకు పారితోషికం చెల్లించలేదు: స్టార్‌ హీరో

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)