సంక్రాంతికి సోగ్గాళ్లు

Published on Mon, 02/09/2026 - 00:32

‘‘వాసివాడి తస్సాదియ్యా... వచ్చే 15 జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటాది కదా. డేట్‌ మార్క్‌ చేసుకోండి’’ అంటూ అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రతినిధులు ‘ఎక్స్‌’లోపోస్ట్‌ చేశారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016). ఈ చిత్రంలో నాగార్జున  ‘వాసివాడి తస్సాదియ్యా...’ అంటూ డైలాగ్‌ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ వచ్చేట్లు ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు కాబట్టి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీ నుంచి కొత్త చిత్రం రాబోతోందని, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుందని స్పష్టమవుతోంది.

ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటికే వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) సినిమాలు సంక్రాంతికే విడుదలై, సూపర్‌హిట్స్‌గా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ ఇటీవలే నాగార్జునను కలిసి ఓ కథ వినిపించారని, ఈ కథతోనే కొత్త సీక్వెల్‌ తెరకెక్కనుందనీ, జూన్‌లో షూటింగ్‌ ఆరంభిస్తారనీ   తెలిసింది. ‘బంగార్రాజు’లో నాగార్జున–నాగచైతన్య నటించారు. వచ్చే సంక్రాంతికి రానున్న చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ కలిసి నటించనున్నారని భోగట్టా.

Videos

సాఫ్ట్ వేర్ విజయశాంతి రెడ్డి కేసులో న్యూ ట్విస్ట్..

టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం

అంబటి రాంబాబుపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు

కాకాణిపై మరో అక్రమ కేసు

బాబుపై తిరగబడుతున్న బీజేపీ, జనసేన

సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో టెంపుల్ రన్

దేవుడితో పెట్టుకున్నావు.. హెరిటేజ్ కు లక్ష రూపాయలు ఫైన్

అంబటి రాంబాబుపై PT వారెంట్.. గుంటూరుకు తరలింపు

తండ్రి బాటలో జగన్..

వర్గపోరులో చిక్కిన ఐపీఎస్ ల బదిలీల ప్రక్రియ

Photos

+5

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)

+5

కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్‌ జగన్‌ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్‌, తేజ సజ్జా (ఫోటోలు)

+5

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)