Breaking News

అసభ్యకరంగా హీరోయిన్‌ మార్ఫింగ్‌ ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు

Published on Tue, 07/14/2026 - 17:35

సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సైబర్ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ మలయాళ హీరోయిన్‌ అన్నా రేష్మా రాజన్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ దాడిపై తీవ్రంగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా, తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేసిన ఓ వ్యక్తిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలను బహిర్గతం చేస్తూ కేరళ పోలీసులు, సైబర్ సెల్‌కు ఆమె ఫిర్యాదు చేశారు.

‘ఈ నీచమైన చర్య నా గౌరవానికి, వ్యక్తిగత ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను సృష్టించేవారైనా, దాన్ని ఇతరులతో పంచుకునే వారైనా సరే చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై అధికారికంగా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపను, చట్టపరంగా ముందడుగు వేస్తాను’ అని ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది.

అన్నా రాజన్‌కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వివిధ వేదికలపై ఆమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. పలు సందర్భాల్లో ఆమె బాడీ షేమింగ్‌కు, అసభ్యకర వ్యాఖ్యలకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడి వాటన్నింటినీ ఆమె తిప్పికొట్టారు.

అన్నా రాజన్‌ సినీ కెరీర్‌ విషయాలకొస్తే.. 2017లో లీజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'అంగమాలి డైరీస్' ద్వారా అన్నా రాజన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన 'లిచ్చి' పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో, ఆమెను అంతా 'లిచ్చి' అని పిలవడం ప్రారంభించారు. 'వెలిపడింతే పుస్తకం', 'మధుర రాజా', 'అయ్యప్పనుమ్ కోషియుమ్' వంటి చిత్రాలకు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'జైలర్ 2' లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)