Breaking News

నిర్మాత లవ్‌ రిజెక్ట్‌ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి

Published on Sun, 01/19/2025 - 19:10

దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్‌ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్‌ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్‌ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్‌గానూ నటించాడు. తన ప్రపోజల్‌ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్‌కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.

రైల్లో నుంచి నెట్టేయాలని..
ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్‌గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్‌ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్‌ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.

కత్తితో బెదిరించి సంతకం..
నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్‌ లెటర్‌ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్‌ సినిమాలో నేనే హీరోయిన్‌గా నటించాలని కాంట్రాక్ట్‌ పేపర్‌పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.

(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)

అంత చెండాలంగా లెటర్‌ రాస్తారా?
నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్‌ లెటర్స్‌ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్‌ లెటర్‌ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది.  

సినిమా
అంజలి.. మలయాళంలో ద కింగ్‌ అండ్‌ ద కమిషనర్‌, 5 సుందరికల్‌, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్‌, టమార్‌ పడార్‌, 100 డిగ్రీ సెల్సియస్‌, సెకండ్స్‌, సెంట్రల్‌ థియేటర్‌, లైలా ఓ లైలా, బెన్‌, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్‌స్టర్‌ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్‌ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్‌ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.

చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)