Breaking News

ఆ సినిమా కోసం అనిరుధ్‌ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్‌ ఫేమస్‌ ఫైట్‌ మాస్టర్స్‌

Published on Tue, 08/22/2023 - 06:38

ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్‌. షారూఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించి తన సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నటించిన పఠాన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో జవాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇందులో కోలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక వర్గం ఎక్కువగా పని చేశారు. కోలీవుడ్‌ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఇందులో నయనతార నాయకిగా, విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు.

అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన జవాన్‌లో మరో విశేషం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్‌ మాస్టర్స్‌ పని చేయడం. స్పిరో రజటొస్‌, యనిక్‌ బెన్‌, ట్రెయిన్‌ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్‌ అరసు మొదలగు ఆరుగురు ఫైట్‌ మాస్టర్స్‌ కంపోజ్‌ చేసిన పోరాట దృశ్యాలు, బైక్‌, కారు ఛేజింగ్స్‌ జవాన్‌ చిత్రంలో హైలెట్‌ కానున్నాయని యూనిట్‌ సభ్యులు తెలిపాయి.

(ఇదీ చదవండి: చిరంజీవిపై విషప్రయోగం.. 35 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం!)

జవాన్‌ చిత్రం ట్రైలర్‌ చూస్తేనే యాక్షన్‌ సన్నివేశాలు అదుర్స్‌ అనిపించేలా ఉన్నాయి. పాటలను భారీగా ఖర్చు చేసి బ్రహ్మాండంగా చిత్రీకరించారు. దీంతో జవాన్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌ 7వ తేదీన తెరపైకి రానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)