Breaking News

భైరవంకి అది ప్లస్‌ అవుతుంది: అనిల్‌ రావిపూడి

Published on Tue, 05/27/2025 - 02:05

‘‘ముగ్గురు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తున్నప్పుడు ముందుగా పక్కన పెట్టాల్సింది అహం. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్‌లను చూస్తే అహంని పక్కనపెట్టి ‘భైరవం’ చిత్రం చేసినట్లు అనిపిస్తోంది. బ్రదర్స్‌లాగా చాలా కలిసిపోయి ప్రమోషన్స్  చేస్తున్నారు. అది ఈ సినిమాకి కచ్చితంగా ప్లస్‌ అవుతుంది’’ అని డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి అన్నారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘భైరవం’. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ హీరోలుగా నటించారు. పెన్‌ స్టూడియోస్‌పై డాక్టర్‌ జయంతిలాల్‌ గడా సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్స్‌ అనిల్‌ రావిపూడి, సంపత్‌ నంది, నిర్మాత బెల్లంకొండ సురేష్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపత్‌ నంది మాట్లాడుతూ–    ‘‘ఈ ముగ్గురు హీరోలు కష్టాలు చూసి నిలబడ్డారు. ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూడండి’’ అని చెప్పారు. ‘‘భైరవం’ కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’’ అన్నారు బెల్లంకొండ సురేష్‌. కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ–‘‘మా సినిమా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు.

‘‘ఒక మంచి సినిమా చూశామనే సంతృప్తిని ‘భైరవం’ ఇస్తుంది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చెప్పారు. ‘‘ఈ సినిమా విజయం సాధించాలని మా యూనిట్‌ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది’’ అని మంచు మనోజ్‌ పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రాన్ని చూసి, మమ్మల్ని ఆశీర్వదించండి’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘ఈ సినిమా ఆడియన్స్ కి నెక్ట్స్‌ లెవెల్‌ ఎక్స్‌పీరియన్స్  ఇవ్వబోతోంది’’ అని విజయ్‌ కనక మేడల తెలి΄ారు. ఈ వేడుకలో ఆనంది, దివ్య పిళ్లై, సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌పాకాల, నటుడు అజయ్‌ మాట్లాడారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)