Breaking News

'మన శంకర వరప్రసాద్' యూనివర్స్‌పై అనిల్ రావిపూడి క్లారిటీ

Published on Sat, 01/10/2026 - 22:54

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌లు సృష్టించుకోవడం కొత్తేమీ కాదు. ఒక సినిమాలో పాత హిట్ సినిమాల రిఫరెన్సులు, క్యారెక్టర్లు వాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే.  

అలాంటి మరో యూనివర్స్ క్రియేట్ చేసే అవకాశం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి సినిమా తీసిన ఆయన, ఈ కాంబినేషన్‌తో యూనివర్స్ సృష్టించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ పోలీస్ పాత్రలో కనిపించారు. కానీ చిరంజీవి సినిమాలో మాత్రం ఆయనను మైనింగ్ డాన్ వెంకీ గౌడగా చూపిస్తున్నట్టు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అంటే ఈ రెండు సినిమాలు ఒకే యూనివర్స్‌లో లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు.  

అయితే భవిష్యత్తులో వెంకటేశ్‌తో మరో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అందులో తప్పకుండా చిరంజీవి క్యామియో పెట్టే ప్రయత్నం చేస్తాను. అప్పుడు తనకంటూ ప్రత్యేకమైన వరప్రసాద్ యూనివర్స్‌ను సృష్టిస్తానని ఆయన చెప్పారు.  

అంటే రాబోయే రోజుల్లో వెంకీ హీరోగా నటించే సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్‌గా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఈ ఆలోచన నిజంగా ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇచ్చేలా ఉంది. అభిమానులు కూడా ఆ రోజు త్వరగా రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)