Breaking News

ప్రపంచకప్‌ ఫైనల్‌.. టీమిండియా కోసం నటి ఆండ్రియా గిఫ్ట్‌

Published on Sat, 11/01/2025 - 07:39

కోలీవుడ్‌లో ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే నటి ఆండ్రియా(Andrea Jeremiah) ఓకే చెప్పేస్తుంది. కానీ, మొదట తనకు నచ్చాలి. తనకు నచ్చితే చాలు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఆమె నటి మాత్రమే కాదు మంచి గాయని, గీత రచయిత కూడా.. సంగీత పరిజ్ఞానం కలిగిన ఆండ్రియా బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. ఈమె పాడిన పలు పాటలు సింగీతప్రియులను అలరించాయి. కాగా తాజాగా ఆండ్రియా ఐసీసీ మహిళా క్రికెట్‌ క్రీడాకారులను ప్రోత్సహించేలా, కీర్తించే విధంగా ఒక ఆంథమ్‌ను రాసి పాడారు.

ఐసీసీ మహిళా క్రికెట్‌ క్రీడాకారులు 2025 టీమ్‌ కోసం బ్రింగ్‌ ఇట్‌ హోమ్‌ పేరుతో రూపొందించిన ఆంగ్ల ఆంథం ఇది. క్రీడాకారుల ధైర్యం, ఆసక్తి, పట్టుదలను ఆవిష్కరించేలా మంచి రిథమ్, మెలోడీ, ఎమోషన్‌తో కూడిన హైఎనర్జిటిక్‌గా రూపొందిన ఈ పాటను ఆండ్రియా, నజీఫ్‌ మహ్మద్‌ కలిసి రాశారు. దీనికి నకుల్‌ అభయంకర్‌ సంగీతాన్ని అందించారు. ఆంగ్ల పదాలతో కూడిన ఈ పాటలో తరికిట్‌ తరికిట తరికిట థోమ్‌ అనే ఇండియన్‌ బాణీ హుక్‌తో ధక్‌ధక్‌ ఉయ్‌ 'బ్రింగ్‌ ఇట్‌ హోమ్‌' ఆనే పల్లవితో సాగే గీతం క్రికెట్‌ క్రీడాకారుల హృదయ స్పందనను తెలియజేసేలా ఉంటుందన్నారు.

ఈ గీతం నవంబర్‌ 2న జరగనున్న ప్రపంచ మహిళా క్రికెట్‌ క్రీడ తుది పోరు సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గీతం గురించి ఆండ్రియా తెలుపుతూ ఇది ఒక పాట మాత్రమే కాదని, పెద్దగా కలలు కనడంతోపాటు, కఠినంగా శ్రమించి విజయాన్ని ఇంటికి తీసుకొచ్చే ఒక మహిళ విజయం అని పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)