Breaking News

బిగ్‌బాస్‌లోకి అలనాటి స్టార్‌ యాంకర్‌! భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌?

Published on Thu, 07/28/2022 - 16:23

తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఇప్పటి వరకు ఐదు సీజన్స్‌ పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో... సీజన్‌ సీజన్‌కి రికార్డు క్రియేట్‌ చేసింది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ఆ షో నడవలేదు. దీంతో త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి,  ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్‌ నిర్వాహకులు. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆరో సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ  క్రమంలో హౌజ్‌ సందడి చేసే కంటెస్టెంట్స్‌ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. 

చదవండి: నాకు లైన్‌ వేయడం ఆపు అనన్య.. విజయ్‌ రిక్వెస్ట్‌

సీజన్‌ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా ఒకప్పటి స్టార్‌ యాంకర్‌ ఉదయభాను పేరు వచ్చి చేరింది. ఒకప్పుడు బుల్తితెరపై ఉదయభాను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బుల్లితెర శ్రీదేవిగా పిలుపించుకున్న ఆమె తనదైన యాంకరింగ్‌, వాక్చాతుర్యం, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకరింగ్‌లో కొత్త కోణం ఆవిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి అనంతరం తెరకు దూరమైన ఆమె క్రేజ్‌ ఇప్పటికీ అలాగే ఉందనడంలో అతిశయోక్తి లేదు. స్టార్‌ హీరోయిన్‌ రెంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఆమె అప్పుడప్పడు టీవీ షోలు, మూవీ ఈవెంట్స్‌లో దర్శనమిస్తూ ప్యాన్స్‌ని పలకరిస్తోంది.

చదవండి: షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్‌, వీడియో వైరల్‌

ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్‌ను బిగ్‌బాస్‌ నిర్వహకులు క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నారట. అందుకే ఆమెను సంప్రదించి ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయభాను బిగ్‌బాస్‌ ఆఫర్‌పై పెద్దగా ఆసక్తి చూపించిడం లేదని తెలుస్తోంది. దీంతో ఎలాగైనా ఆమెను ఒప్పించి బిగ్బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. ఉదయభానుతో నేరుగా మాట్లాడి ఒప్పింయే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వని రేంజ్‌లో ఉదయభానుకు రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు కూడా బిగ్‌బాస్‌ నిర్వహకులు సిద్ధంగా ఉన్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుంది.. బిగ్‌బాస్‌ 6లో ఉదయభాను సందడి చేస్తుందా?లేదా? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది.  

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)