Breaking News

'అల్లు అర్జున్‌' సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్‌ స్రవంతి

Published on Wed, 02/11/2026 - 09:34

యాంకర్‌ స్రవంతి సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు స్టార్‌ యాంకర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. పలు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ అందరికీ దగ్గరైంది. 2009లోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సరైన గుర్తింపు లేక ఛాన్స్‌ల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, పుష్ప విడుదల సమయంలో అల్లు అర్జున్‌తో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ తన జీవితాన్నే మార్చేసింది.   తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ గురించి చెబుతూ శ్రవంతి ఎమోషనల్‌ అయింది.

2021లో  పుష్ప సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌ను యాంకర్‌ స్రవంతి ఇంటర్వ్యూ చేసింది. ఆమె కెరీర్‌లో అతిపెద్ద స్టార్‌ను కలవడం అదే తొలిసారి. తర్వాత ఆ ఇంటర్వ్యూ సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఆమెకు వెంటనే బిగ్‌బాస్‌-5లో ఛాన్స్‌ దక్కింది.  అనంతరం తన కెరీర్‌ పూర్తిగా ఉన్నత స్థానానికి చేరుకుంది. కేవలం బన్నీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్‌ దక్కడంతోనే తనకు గుర్తింపు వచ్చిందని ఆమె చెబుతుంది. అల్లు అర్జున్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని అంటూ ఆమె ఇలా చెప్పుకొచ్చింది.

'పుష్ప సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్‌తో ఇంటర్వ్యూ చేశాను. అప్పటి వరకు నా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.  ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో షేర్‌ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. అలా నాకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో వెంటనే బిగ్‌బాస్‌-5లో ఛాన్స్‌ వచ్చింది. ఒక రకంగా అల్లు అర్జున్‌ వల్ల నా జీవితమే మారిపోయింది. అందుకే ఆయనపట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత సైమా అవార్డ్స్‌లో బన్నీని కలిశాను. సైమా వేదికపై అవార్డ్‌ అందుకునేందుకు బన్నీ పేరును నేనే పిలిచాను.. అప్పడు నా గతాన్ని గుర్తుచేసుకుని బన్నీని చూడగానే తెలీయకుండానే కన్నీళ్లు వచ్చాయి. నాకు ఆయన చాలా సాయం చేశారు. ప్రతి పుట్టినరోజు నాడు అల్లు అర్జున్‌ గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్తాను.  ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటే  అందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్‌ మాత్రమే..' అంటూ శ్రవంతి చెప్పింది.

అందరూ అనుకుంటున్నట్లు అల్లు అర్జున్‌లో ఎలాంటి గర్వం ఉండదని స్రవంతి చెప్పారు. కానీ, కొందరు పనికట్టుకుని విమర్శించడం సాధరణమే అన్నారు. రెగ్యూలర్‌గా చాలామంది ఫ్యాన్స్‌ ఆయన ఇంటికి వెళ్తుంటారు.  వారందరితో కలిసి ఫోటోలు దిగుతారు. ఇతరులను ఆయన ఎప్పడు కూడా చులకన చేసి చూడరు. ఇలా బన్ని గురించి స్రవంతి చెప్పింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)