Breaking News

వివాదంలో యాంకర్‌ రవి, సుడిగాలి సుధీర్‌.. మరి చిరంజీవిది తప్పు కాదా?

Published on Fri, 04/11/2025 - 13:28

యాంకర్‌ రవి (Anchor Ravi), సుడిగాలి సుధీర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో వీరు సరదాగా చేసిన స్కిట్‌ బయట సీరియస్‌గా మారింది. అందులో రవి.. నందీశ్వరుడిపై నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు చూడు అని చెప్పగా.. తనకు మాత్రం అమ్మాయి కనిపిస్తుంది అన్నాడు సుధీర్‌ (Sudigali Sudheer). ఈ స్కిట్‌పై జనాలు భగ్గుమన్నారు. ఓ వర్గాన్ని తక్కువ చేశారని మండిపడ్డారు. స్కిట్‌పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూట్యూబ్‌ నుంచి ఆ వీడియోను డిలీట్‌ చేశారు.

ఆడియో వైరల్‌
అయినప్పటికీ ఈ వివాదం సమసిపోలేదు. ఓ హిందూ ఆర్గనైజేషన్‌కు చెందిన ఓ వ్యక్తి యాంకర్‌ రవితో మాట్లాడిన ఆడియో కాల్‌ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీ స్కిట్‌ హిందువులను కించపరిచేలా ఉంది. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని సదరు వ్యక్తి యాంకర్‌ రవిని డిమాండ్‌ చేశాడు. అందుకు రవి స్పందిస్తూ.. చిరంజీవి గారు బావగారు బాగున్నారా? సినిమాలో ఇదే సన్నివేశం ఉంటుంది. ఆయన చేసినదాన్ని తప్పు అని ఎందుకు చెప్పలేదు? 

అది తప్పనలేదే?
దాన్ని ఎవరూ తప్పనలేదు కాబట్టి మేమూ అదే తీసుకొచ్చి స్కిట్‌గా చేశాం. బావగారు బాగున్నారా? మూవీలోని ఆ సీన్‌ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. అది ఎవరైనా తప్పని చెప్పుంటే మాకు తెలిసేది. అయినా మేము ఏ దేవుడినీ కించపరచలేదు. పైగా నందీశ్వరుడిని స్టేజీపైకి తెచ్చినప్పుడు అందరం షూలు కింద విడిచేసి ఈ స్కిట్‌ చేశాం. అయినప్పటికీ మా స్కిట్‌పై కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ వీడియోను యూట్యూబ్‌లో నుంచి తీసేశాం. మేము ఎవరినీ కించపరచలేదని ధైర్యంగా చెప్తున్నాను. మేము ఏ తప్పూ చేయలేదు అని యాంకర్‌ రవి వివరణ ఇచ్చాడు.

చదవండి: సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్‌ ఆన్సరిదే!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)