Breaking News

కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్

Published on Sun, 06/22/2025 - 17:07

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే సాధారణమైన విషయం ఏం కాదు. స్టార్ హీరోల వారసులైనా సరే సరైన మూవీస్ చేస్తేనే నిలబడతారు. లేదంటే మెల్లగా సైడ్ అయిపోతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే తెలుగులో యాంకర్‌గా టాప్‌లో ఉండే ప్రదీప్.. గత కొన్నేళ్లుగా తన ప్రొఫెషన్‌ని పక్కనబెట్టి హీరోగా ప్రయత్నాలు చేశాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడికే వచ్చేశాడు.

యాంకర్‌గా ప్రదీప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్ల నుంచి ఛానల్‌తో డ్యాన్స్, కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ వచ్చాడు. ఇవి చేస్తూనే అత్తారింటికి దారేది, 100% లవ్ తదితర చిత్రాల్లో సహాయ పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల తర్వాత మంచి గుర్తింపు రావడంతో హీరోగా ప్రయత్నిద్దామని '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీలో ఒక్క పాట తప్పితే సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని 'అక్కడ అమ్మాయి ఇ‍క్కడ అబ్బాయి' అనే చిత్రంతో వచ్చాడు.

(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్‌.. మొత్తం ఎన్ని కోట్లు?)

కొన్ని నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా కూడా ప్రదీప్‌కి హీరోగా అదృష్టం తీసుకురాలేకపోయింది. దీంతో ఆలోచనలో పడిపోయాడు. తనకు తెలిసిన యాంకరింగ్ మళ్లీ మొదలుపెట్టేశాడు. 'కుక్ విత్ జాతిరత్నాలు' పేరుతో ఈ వీకెండ్ నుంచి ప్రారంభం కాబోతున్న కామెడీ వంట షోకి యాంకరింగ్ చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. తమిళంలో ఇదివరకే హిట్టయిన 'కుక్ విత్ కోమలి' అనే షో దీనికి స్పూర్తి. ఇందులో యష్మీ, సన్నీ, బాబా మాస్టర్, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, దీక్షా పంత్, హరి, సీరియల్ నటుడు ప్రభాకర్, ముక్కు అవినాష్ ఉన్నారు.

ప్రదీప్ మళ్లీ యాంకరింగ్ వైపు రావడం బట్టి చూస్తే హీరోగా పెద్దగా వర్కౌట్ కాలేదని రియలైజ్ అయినట్లు ఉన్నాడు. బహుశా అందుకే మళ్లీ షోలు చేయడం మొదలుపెట్టాడని అనిపిస్తోంది. ప్రదీప్ అనే కాదు సుడిగాలి సుధీర్ కూడా గతంలో ఇలానే రెండు మూడు సినిమాల్లో హీరోగా చేశాడు. కాకపోతే వీటిలో 'గాలోడు' అనే మూవీ తప్పితే మిగతావన్నీ ఆడలేదు. దీంతో ఎప్పటిలానే యాంకరింగ్ చేసుకుంటూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన వేడుకలో రాకింగ్ రాకేశ్)

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య