Breaking News

మళ్లీ రెచ్చిపోయిన అనసూయ.. విజయ్‌ను టార్గెట్‌ చేసిందా?

Published on Sat, 05/06/2023 - 11:05

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అనసూయ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా షేర్‌ చేస్తుంటుంది. అయితే అవి కొన్నిసార్లు కాంట్రవర్సీలకు కారణం అవుతుంటాయి. తాజాగా విజయ్‌ దేవరకొండను టార్గెట్‌ చేస్తూ అనసూయ చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ను షేర్‌ చేస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ది విజయ్‌ దేవరకొండ అని రాసి ఉంది. (సాధారణంగా యూనిక్ విషయాలకు, వస్తువుల గురించి మెన్షన్‌ చేసేటప్పుడు ది అని వాడుతుంటాం).

ఈ పోస్టర్‌పై పరోక్షంగా స్పందించిన అనసూయ ట్వీట్‌ చేస్తూ.. ఇప్పుడే ఒకటి చూశాను.. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం" అంటూ ఎవరి పేరు మెన్షన్‌ చేయకుండానే అనాల్సిందంతా అనేసింది. ఈ క్రమంలో విజయ్‌ను కావాలనే టార్గెట్‌ చేసిందంటూ రౌడీ ఫ్యాన్స్‌ అనసూయపై ఫైర్‌ అవుతున్నారు. ఆంటీ అంటూ అనసూయను తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

దీనిపై రియాక్ట్‌ అయిన అనసూయ.. భలే రియాక్ట్‌ అయ్యారు దొంగ.. ఊప్స్‌.. బంగారుకొండలంతా నేను అనేది నిజమని నిరూపిస్తున్నారు అంటూ మరో ట్వీట్‌ చేసింది.  గతంలో అర్జున్‌ రెడ్డి, లైగర్‌ సినిమాల విషయంలోనూ అనసూయ, విజయ్‌ ఫ్యాన్స్‌కు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)