Breaking News

చంద్రకళ మనసుల్లో నిలిచిపోతుంది

Published on Thu, 12/18/2025 - 03:39

‘‘చాంపియన్‌’ కథ విన్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించింది.  సినిమాలో నేను చేసిన చంద్రకళ పాత్ర చాలా బాగుంటుంది. డైరెక్టర్‌ ప్రదీప్‌గారి సపోర్ట్‌తో నా క్యారెక్టర్‌కి ఏం కావాలో అన్నీ పర్ఫెక్ట్‌గా చేశాను. నా పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది’’ అని మలయాళ భామ అనస్వరా రాజన్‌ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్‌ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్‌’.

 ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనస్వరా రాజన్‌ మాట్లాడుతూ – ‘‘వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌లాంటి సంస్థలు నిర్మించిన సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి, ఎన్నో అద్భుతమైన మెసేజ్‌లు పంపారు. 

తెలుగులో నా తొలి సినిమాని కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగు సినిమా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇక్కడ ఫిల్మ్‌ మేకర్స్,ప్రొడ్యూసర్స్‌ సపోర్టివ్‌గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పని చేస్తే మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ‘ఇట్లు మీ అర్జున’ సినిమా చేస్తున్నాను. ‘చాంపియన్‌’ మూవీ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇది’’ అని పేర్కొన్నారు.  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)