మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి
Breaking News
వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..!
Published on Sun, 07/03/2022 - 16:57
Anasuya As Prostitute In Kanyasulkam Web Series: బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. 'రంగస్థలం'లో 'రంగమ్మత్త'గా నటించి ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా చేసి మరింత పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంలో మరో ప్రత్యేకమైన రోల్‌లో ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది. తాజాగా మరో క్రేజీ పాత్రలో అనసూయ నటించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
గురజాడ అప్పారావు రచించిన క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కథతో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఒక వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నాడట. ఈ వెబ్ సిరీస్‌కు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ కథ-కథనం స్క్రిప్ట్ బాధ్యతలన్నీ క్రిష్ చూసుకోనున్నాడని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. ఈ రోల్‌లో నటించేందుకు అనసూయ సైతం ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో అనసూయ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్
అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు
Tags : 1