Breaking News

ఆంటీ అంటావా? దమ్ముంటే పైకి రారా..: యాంకర్‌ అనసూయ సవాల్‌

Published on Sat, 03/15/2025 - 17:43

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం.. అని ఠాగూర్‌ సినిమాలో చిరంజీవి పదే పదే అంటుంటాడు. అలాగే తెలుగు, ఇంగ్లీష్‌.. ఏదైనా కానీ నాకు నచ్చని ఏకైక పదం ఆంటీ అంటోంది అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bharadwaj). ఏళ్ల తరబడి ఈ పదంపై ఉద్యమమే చేస్తోందీ యాంకర్‌. ఎవరు పడితే వారు ఆంటీ అంటే ఊరుకునేది లేదు.. అలా పిలవాలంటే నా బంధువులై ఉండాలి, లేదా చిన్నపిల్లలై ఉండాలని అప్పట్లోనే కుండ బద్ధలు కొట్టింది.

హోలీ ఈవెంట్‌లోనూ 'ఆంటీ' పిలుపు
కానీ జనాలు వింటేగా.. తనకు ఇష్టం లేదని చెప్తున్నా సరే పట్టించుకోకుండా సందు దొరికినప్పుడల్లా ఆంటీ అని ఏడిపిస్తున్నారు. శుక్రవారం (మార్చి 14న) హోలి సెలబ్రేషన్స్‌లో పాల్గొంది అనసూయ. హైదరాబాద్‌లోని ఓ హోలి ఈవెంట్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా వెళ్లిన ఆమెను ఓ ఆకతాయి ఆంటీ అని పిలిచాడు. ఆ పిలుపు తన చెవిన పడటంతో అనసూయకు చిర్రెత్తిపోయింది.

రెచ్చగొట్టకు..
దమ్ముంటే స్టేజీపైకి రా అని సవాల్‌ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని ధమ్కీ ఇచ్చింది. ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అటు అనసూయ తగ్గదు, ఇటు జనాలు మారరు అని కామెంట్లు చేస్తున్నారు.

యాంకర్‌గా, నటిగా..
అనసూయ.. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఎన్నో యేళ్లుగా పలు టీవీ షోలలో యాంకర్‌గా, జడ్జిగా పని చేసింది. ఈ మధ్య బుల్లితెరను వదిలేసి వెండితెరపైనే ఎక్కువ బిజీ అయింది. క్షణం, రంగస్థలం, మీకు మాత్రమే చెప్తా, పుష్ప 1, పుష్ప 2, విమానం, ప్రేమ విమానం, రజాకార్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. సూయ సూయ సూయ.., పైన పటారం లోన లొటారం, వా వా మేరే బావా వంటి స్పెషల్‌ సాంగ్స్‌లోనూ మెరిసింది. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా నుంచి రిలీజైన కొల్లగొట్టినాదిరో పాటలోనూ యాక్ట్‌ చేసింది.

చదవండి: అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)