Breaking News

అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?

Published on Wed, 04/30/2025 - 07:53

పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అని ఫ‍్యాన్స్ చూస్తున్న టైంలో తమిళ దర్శకుడు అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అంతకు ముందు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాక్ అవడంతో.. గురూజీతోనే మూవీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అట్లీతో సినిమాను అనౌన్స్ చేశారు.

(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)  

తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్-అట్లీ సినిమాను నిర్మించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ విషయం అర్థమైపోయింది. హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో హీరో-దర్శకుడు చర్చలు జరపడం అవి చూస్తుంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా అనిపించింది.

అట్లీ సినిమా అంటే హీరోకు ఎన్ని ఎలివేషన్లు ఉంటాయనే సంగతి పక్కనబెడితే హీరోయిన్లు ఒకరు కంటే ఎక్కువ మందే ఉంటారు. ఇక బన్నీతో చేయబోయే మూవీలోనూ ఏకంగా ముగ్గురు భామలు ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లందరూ బాలీవుడ్ బ్యూటీలా లేదంటే దక్షిణాది హీరోయిన్లు ఉంటారా అనే దగ్గర కన్ఫ్యూజన్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో)  

మొన్నటివరకు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్ పేర్లు వినిపించాయి. తాజాగా అనన్య పాండే పేరు వినిపించేసరికి బన్నీ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే అనన్య ఇప్పటివరకు హిందీలో సినిమాలైతే చేస్తోంది గానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దానికి తోడు ఈమె యాక్టింగ్ పై బోలెడన్ని విమర్శలు.

దీంతో హీరోయిన్ గా అనన్య పాండే వద్దు బాబోయ్ అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే హీరోయిన్లు ఎవరనే సస్పెన్స్.. షూటింగ్ మొదలయ్యే వరకు కొనసాగే అవకాశముంది. మొన్నటివరకు సమంత, దిశా పటానీ పేర్లు కూడా వినిపించాయి కానీ బన్నీ-అట్లీ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: ‍థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)