Breaking News

అప్పుడేదో తెలీక అన్నాను, కానీ బోల్డ్‌ సీన్స్‌..: అనన్య

Published on Thu, 02/29/2024 - 12:43

మల్లేశం మూవీతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది అనన్య నాగళ్ల. ఒక్క సినిమాతోనే పేరు తెచ్చుకున్న ఈ సుందరాంగి వరుస అవకాశాలు అందుకుంది. ప్లే బ్యాక్‌, వకీల్‌ సాబ్‌, మాస్ట్రో, మళ్లీ పెళ్లి.. ఇలా అనేక సినిమాలు చేసింది. అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈసారి తంత్ర అనే హారర్‌ మూవీతో భయపెట్టేందుకు రెడీ అయింది. ఈ సినిమాతో పాటు పొట్టేల్‌ అనే మూవీ కూడా పూర్తి చేసింది. ఇది రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇకపోతే బోల్డ్‌ సన్నివేశాలకు తాను దూరమని చెప్పిన అనన్య పొట్టేలు చిత్రంలో మాత్రం హద్దులు చెరిపేసి యాక్ట్‌ చేసింది.

సినిమాకు అవసరం, అందుకే..
తంత్ర సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అనన్యకు 'పొట్టేల్‌'లోని ముద్దు సన్నివేశం గురించి ప్రశ్న ఎదురైంది. అలాంటి సన్నివేశాలు తంత్రలో కూడా ఉంటాయా? అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. ఇందుకు అనన్య స్పందిస్తూ.. 'ముద్దు సన్నివేశమనేది ఆ సినిమాకు చాలా అవసరం. అందుకని చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో గ్లామర్‌, రొమాంటిక్‌ సీన్స్‌, హారర్‌.. అన్నీ ఉన్నాయి.

అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది
ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పు లేకపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నేను ఎలా ఉన్నా మంచి రోల్స్‌ నా దగ్గరకు వస్తాయనుకున్నాను. పర్ఫామెన్స్‌ చేస్తే చాలనుకున్నాను. కానీ.. పర్ఫామెన్స్‌లో ఈ తరహా రోల్స్‌ కూడా భాగమేనని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది' అని చెప్పుకొచ్చింది. అంటే కథ డిమాండ్‌ చేస్తే ఎటువంటి బోల్డ్‌ సీన్స్‌ చేయడానికైనా రెడీ అని చెప్పకనే చెప్పింది అనన్య.

చదవండి: 'అవును.. ఊహించిందే జరిగింది'.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన దీపికా పదుకొణె!

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్