Breaking News

అదే ప్రాబ్లమ్‌.. ఎవరూ ప్రపోజ్‌ చేయట్లేదు: అనన్య

Published on Sat, 04/15/2023 - 17:11

‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ‘వకీల్‌ సాబ్‌’తో మరింత ఫేమస్‌ అయింది. ఈ చిత్రం తర్వాత అనన్యకు వరుస అవకాశాలు లభించాయి. రీసెంట్‌గా విడుదలైన శాకుంతలం చిత్రంలోనూ  ఓ మంచి పాత్ర పోషించింది. ఇక ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. నిత్యం హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.

తాజాగా ఈ నటి.. తన బాయ్‌ఫ్రెండ్‌, ప్రేమవ్యవహారం గురించి స్పందించింది. ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన అనన్యను.. ‘నీ బాయ్‌ఫ్రెండ్‌ పేరు, అతని ఇన్‌స్టా ఐడీ చెప్పు’ అని ఓ నెటిజన్‌ అడిగాడు. దీనిపై అనన్య స్పందిస్తూ.. ‘బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. అదే ప్రాబ్లమేమో’ అంటూ అనన్య నాగళ్ల నవ్వేసింది.

అలాగే మీ వాట్సాప్ డీపీ ఏంటని అడగ్గా.. ఆమె ఫోటో పెట్టింది. ఇక మరో నెటిజన్‌ ‘లాస్ట్‌ టైమ్‌ స్టేడియంలో మిమ్మల్ని బాటిల్‌తో కొట్టా.. చాలా బాధగా ఉంది’అని కామెంట్‌ చేయగా.. ‘మీరేనా కొట్టింది? తప్పు కదా? ఆ రోజు మీరు పిలిచినప్పుడు వెనక్కి తిరిగి హాయ్‌ కూడా చెప్పాను. అలా ఏ యాక్టర్‌తోనూ ప్రవర్తించకండి. మేము కూడా మనుషులమే కదా. నాకైతే ఆ రోజు చాలా భయమేసింది’ అని అనన్య రిప్లై ఇచ్చింది.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)