Breaking News

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్

Published on Sun, 06/16/2024 - 17:51

ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.

(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)

మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది 'తంత్ర' అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొట్టేల్' అనే మూవీ ఉంది.

మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే 'బహిష్కరణ' సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

(ఇదీ చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్‌ చేసి..)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)