మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
Published on Thu, 04/17/2025 - 13:42
ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శివంగి. ఆనంది (Anandi) సత్యభామగా.. వరలక్ష్మి పోలీసాఫీసర్‌గా మెప్పించారు. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో నరేశ్‌బాబు.పి నిర్మించిన ఈ చిత్రం మార్చి 7న విడుదలైంది. నెలన్నర తర్వాత ఈ సినిమా సడన్‌గా ఓటీటీ (OTT)లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (AHA)లో ప్రసారమవుతోంది. ఈరోజు (ఏప్రిల్ 17) నుంచి తెలుగు వర్షన్ స్ట్రీమ్ అవుతుండగా రేపటి నుంచి తమిళ వర్షన్ ప్రసారం కానుంది.
కథేంటంటే?
సత్యభామ (ఆనంది) సాధారణ గృహిణి. ఓవైపు భర్త అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దీనికి తోడు అత్త వేధింపులు! ఇదిలా ఉండగా ఓ రోజు తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకుపోతారు. తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయిస్తుంది. అక్కడేం జరిగింది? ఎవరైనా చనిపోయారా? చంపేశారా? సత్యభామ తన కష్టాలను ఎలా దాటింది? అనేది తెలియాలంటే ఆహాలో శివంగి చూడాల్సిందే!
చదవండి: సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్?
Tags : 1