Breaking News

కోలీవుడ్‌లో జాంబిరెడ్డి హీరోయిన్‌ కొత్త సినిమా!

Published on Sat, 07/29/2023 - 14:09

మంచి కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను తెచ్చుకున్న నటి 'కయల్‌' ఆనంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వైట్‌రోస్‌. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటుడు ఆర్‌కే సురేష్‌ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. రంజని నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజశేఖర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు సుశిగణేశన్‌ శిష్యుడు అన్నది గమనార్హం.

చిత్ర యూనిట్‌ వైట్‌రోస్‌ వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువతి ఎదుర్కొనే సమస్యలు ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రం అన్నారు. ఇది ఉత్కంఠ భరితంగా సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ఆనంది పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆమె కెరీర్‌లోనే ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెప్పారు.

ఆనంది అద్భుతంగా నటిస్తున్నారన్నారు. సురేష్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నారు. అదేవిధంగా చిత్రంలో మరో ప్రముఖ నటి నటించనున్నారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి జోహన్‌, శివనేశ్‌ సంగీతాన్ని ఇళయరాజా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇకపోతే జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో ఆనంది తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఇటీవలే ఆమె తెలుగులో కస్టడీ సినిమాలో కనిపించింది.

చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషిపై జాలి చూపించిన హీరోయిన్‌
వృద్ధుడిపై సీరియల్‌ నటి వలపు వల

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు