Breaking News

అదే నా ఫస్ట్‌ బ్రేకప్‌.. కోలుకోవడానికి నాలుగైదేళ్లు పట్టింది!

Published on Sat, 02/10/2024 - 17:51

బేబి సినిమాలో హీరోయిన్‌ను గాఢంగా ప్రేమిస్తాడు హీరో ఆనంద్‌ దేవరకొండ. బ్రేకప్‌ తర్వాత ఆమెను మర్చిపోలేక నరకం అనుభవిస్తాడు. నిజ జీవితంలోనూ అలాంటి నరకం చూశానంటున్నాడీ యంగ్‌ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్‌ బాధను బయటపెట్టాడు.

చికాగో వెళ్లాక తనతో జాలీగా ఉండొచ్చనుకున్నా
ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఇది నా ఫస్ట్‌ లవ్‌ స్టోరీ. నేను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లింది. నేను కూడా అమెరికా వెళ్దామని ఎప్పటినుంచో ప్లాన్‌ చేసుకుంటున్నాను. కాబట్టి చికాగో చుట్టుపక్కలే ఏదైనా ఒక యూనివర్సిటీలో ఉందామనుకున్నాను. అమెరికాలోని టాప్‌ 5 ఇంజనీరింగ్‌ కాలేజీకి అప్లై చేస్తే సీటు దొరికింది. షాకయ్యాను. ఇంక చికాగోకు వెళ్లిపోయాక ఇద్దరికీ స్వేచ్ఛ దొరుకుతుంది. కలిసి ఉండొచ్చు, మా ప్రేమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకున్నాను. కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! అక్కడికి వెళ్లాక వ్యవహారం బెడిసికొట్టింది.

బ్రేకప్‌ బాధ..
నా గుండె పగిలినంత పనైంది. ఆ బ్రేకప్‌ బాధలో నుంచి బయటపడటానికి నాలుగైదేళ్లు పట్టింది. ఎంతో నిజాయితీగా ప్రేమించాను. కానీ వర్కవుట్‌ కాలేదు. చాలా బాధపడ్డాను' అని చెప్పుకొచ్చాడు. అమెరికాలో చదువుకుని అక్కడ కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు ఆనంద్‌. ఆ సమయంలో ఏడాదికి రూ.40 లక్షల జీతం తీసుకున్నాడు. కానీ సినిమాల మీద ఆసక్తితో జాబ్‌ వదిలేసి ఇండియాకు వచ్చాడు. దొరసాని సినిమాతో హీరోగా మారాడు. మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌, పుష్పక విమానం, హైవే ఇలా భిన్న ప్రాజెక్టులు చేసుకుంటూ పోయాడు. గతేడాది బేబి చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు.

చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)