రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
Breaking News
‘అనగనగా ఒక రాజు’ మూవీ ట్రైలర్ రివ్యూ
Published on Thu, 01/08/2026 - 13:52
ఈ సంక్రాంతికి చివరిగా రాబోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. నవీన్ మార్క్ కామెడీతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది ఈ ట్రైలర్.
‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు’ అంటూ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గుడిలో ఉన్న హుండీలో నోట్ల కట్టను వేసేందుకు హీరో ప్రయత్నించడం..అందులో పట్టకపోవడంతో ‘పంతులుగారు.. ఎన్నిసార్లు చెప్పానండి..కన్నం పెద్దది చేయమని..నోట్లు పట్టట్లేదు’ అని నవీన్ అంటే.. చిల్లర వేయడం కోసం చిన్నగా పెట్టామని పంతులు అంటాడు. వెంటనే ‘చిల్లరగాళ్ల కోసం సపరేట్ హుండీ పెట్టండి’ అని నవీన్ పంచ్ విసురుతారు.
ఇలా ట్రైలర్ మొత్తం నవీన్ మార్క్ కామెడీతో సాగుతుంది. అమెరికాకు వెళ్లే యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకునే యువతి పాత్రలో మీనాక్షి చక్కగా నటించింది. మీనాక్షి, నవీన్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరించదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
నవీన్, మీనాక్షి ప్రేమకథకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "పండగకు అల్లుడు వస్తున్నాడు" అంటూ ఎద్దులబండిపై నవీన్ ను చూపిస్తూ సంక్రాంతికి పండుగను ముందుగానే తీసుకొచ్చారు. మొత్తానికి, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, పండగ వాతావరణం అన్నీ కలగలిసిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
Tags : 1