Breaking News

పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్

Published on Mon, 12/16/2024 - 16:15

'హనుమాన్' సినిమాతో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లాంటి వాళ్లకు బాగానే పేరొచ్చింది గానీ హీరోయిన్‌ అమృత అయ్యర్‌కి అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు ఎందుకో సరైన బ్రేక్ దొరకట్లేదు. ఇప్పుడు 'బచ్చలమల్లి' మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం (డిసెంబర్ 20)న థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)

'బచ్చలమల్లి' ప్రమోషన్స్‌లో భాగంగా అమృత అయ్యర్‌కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 40 మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. రకుల్, నాగచైతన్య, కీర్తి సురేశ్.. ఇలా టాప్ హీరోహీరోయిన్లు చాలామంది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అమృత కూడా వివాహ చేసుకునేందుకు సిద్ధమే. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్పింది.

'2025లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినే చేసుకుంటా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి' అని అమృత అయ్యర్ చెప్పింది.

(ఇదీ చదవండి: మళ్లీ గాయపడిన స్టార్ హీరో ప్రభాస్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)