Breaking News

రూ.120 కోట్లతో అమితాబ్ టాప్!

Published on Tue, 03/18/2025 - 19:01

మన దేశంలో పలువురు సెలబ్రిటీలు సినిమాలు, యాడ్స్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తారు. అదే టైంలో ప్రభుత్వానికి ట్యాక్స్ (పన్ను) కూడా కడుతుంటారు. అదీ కోట్లలోనే ఉంటుంది. తాజాగా ఈ లిస్టులో అగ్రస్థానానికి బిగ్ బీ అమితాబ్ (Amitabh Bachchan) వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ గత ఏడాది కాలంలో ఎంత సంపాదించారంటే?

(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)

82 ఏళ్ల వయసులోనే ఫుల్ ఎనర్జీతో పనిచేస్తున్న అమితాబ్ బచ్చన్.. గతేడాది 'కల్కి'లో (Kalki 2898AD) ప్రభాస్ కి ధీటుగా నటించి ఆకట్టుకున్నారు. మరోవైపు 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోతోనూ అలరిస్తున్నారు. కొన్ని యాడ్స్ కూడా చేస్తున్నారు. అలా 2024-25 సంవత్సరానికి గానూ దాదాపు రూ.350 కోట్ల వరకు సంపాదించారట. ఇందులోనూ రూ.120 కోట్ల ట్యాక్స్ ఈ మధ్యే కట్టారట.

మన దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టే సెలబ్రిటీల్లో గతేడాది షారుక్ ఖాన్ (రూ.92 కోట్లు) అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలొచ్చాయి. ఇతడి  తర్వాత తమిళ హీరో దళపతి విజయ్ (రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) ఉండగా.. నాలుగో స్థానంలో అమితాబ్ ఉన్నాడు. ఈసారికి వచ్చేసరికి ఎక్కువ పన్ను కట్టి టాప్ లోకి వచ్చేశాడని సమాచారం.

(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)