Breaking News

ఖరీదైన ఫ్లాట్‌ను అమ్మేసిన అమితాబ్ బచ్చన్.. ఎన్ని కోట్లు లాభమంటే?

Published on Mon, 01/20/2025 - 18:27

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ విలాసవంతమైన ఫ్లాట్‌ను అమ్మేశారు. ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో ఖరీదైన డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను విక్రయించారు. దాని విలువ దాదాపు రూ.83 కోట్లు ఉంటుందని ప్రముఖ రియాల్టీ సంస్థ స్క్వేర్‌యార్డ్స్  వెల్లడించింది. ఆ ఫ్టాట్ దాదారు 5 వేలకు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలిపింది.

అమితాబ్‌ బచ్చన్‌ ఈ ఫ్లాట్‌ను  ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. అంధేరీ ప్రాంతంలోని తన డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను ఈనెల 17న వ తేదీన విక్రయించారు. ఈ అపార్ట్‌మెంట్‌లో దాదాపు ఆరు కార్లు పార్కింగ్  చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్‌ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్‌ కొనుగోలు చేశారు.

కాగా.. అమితాబ్ బచ్చన్ కుటుంబం గత నాలుగేళ్లలో రియల్ ఎస్టేట్‌లో దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. గతంలో అభిషేక్ బచ్చన్ ముంబయిలో ఒకే అంతస్తులో నాలుగు పెద్ద ఫ్లాట్‌లను కొనుగోలు చేశారు. ముఖ్యంగా గతేడాదిలోనే రూ. రియల్ ఎస్టేట్‌లో 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వాటిలో ప్రధానందగా నివాస సముదాయాలతో పాటు వాణిజ్య స్థలాలు  ఓషివారా, మగాథనే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో ఉన్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ గతేడాది ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి