Breaking News

వివాదాలు సృష్టించవద్దు!: ఫరా ఖాన్‌

Published on Wed, 10/01/2025 - 02:47

దర్శకురాలు ఫరా ఖాన్, హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ల మధ్య అబీప్రాయభేదాలొచ్చాయని, అందుకే ఇన్‌స్టాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారన్నది బాలీవుడ్‌ టాక్‌. దీపిక కెరీర్‌లోని రెండు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ‘ఓం శాంతి ఓం’ (2007), ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ (2014)లో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించగా, ఫరా ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఇలా దీపిక–ఫరాల మధ్య మంచి అనుబంధం ఉంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల్లో హీరోయిన్స్‌ 8 గంటలే పని చేయాలన్నట్లుగా, ‘ఎయిట్‌ అవర్స్‌ షిఫ్ట్‌’ కాన్సెప్ట్‌ గురించి దీపిక మాట్లాడారు. ఈ కాన్సెప్ట్‌పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఫరా ఈ ‘ఎయిట్‌ అవర్స్‌ షిప్ట్‌’ గురించి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో దీపికను ఉద్దేశించే ఫరా ఖాన్‌ అలా మాట్లాడారని, అందుకే వీరిద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో అయ్యారని ప్రచారమవుతోంది.

ఈ ప్రచారంపై ఫరా స్పందించారు. ‘‘హ్యాపీ న్యూ ఇయర్‌’ సినిమా షూటింగ్‌ సమయంలోనే నేను, దీపిక ఇన్‌స్టాలో కాకుండా డైరెక్ట్‌ మెసేజ్‌ లేదా ఫోన్‌ కాల్స్‌ ద్వారా మాట్లాడాలనుకున్నాం. అప్పుడే మేం ఒకరినొకరం అన్‌ఫాలో అయ్యాం. కొన్ని వెబ్‌పోర్టల్స్‌ కొత్త వివాదాలు సృష్టిస్తున్నారు’’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ఫరా షేర్‌ చేశారు. ఈ స్టోరీకి ఓ నమస్కారం ఎమోజీతో దీపిక స్పందించారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)