భర్తతో విడాకులు? ఒక్క ఫోటో తప్ప అన్నీ డిలీట్‌ చేసిన నిహారిక!

Published on Mon, 04/10/2023 - 11:48

ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలు. చాలామంది సెలబ్రిటీలు ప్రొఫెషనల్‌ లైఫ్‌లో రాణించినా పర్సనల్‌ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతుంటారు. మెగా డాటర్‌ నిహారిక- చైతన్య జొన్నలగడ్డ విషయంలోనూ ఇదే జరిగినట్లు తెలుస్తోంది.

సోషల్‌ మీడియాలో హడావుడి చేసే ఈ జంట కొంతకాలంగా గప్‌చుప్‌ అయిపోయింది. గత నెలలో చైతన్య తమ పెళ్లి ఫోటోలు సైతం డిలీట్‌ చేశాడు. ఇద్దరూ ఒకరినొకరిని అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో వీరి మధ్య వైరం నడుస్తోందని, విడాకులు తథ్యమని ప్రచారం జోరందుకుంది. తాజాగా నిహారిక కూడా తమ పెళ్లి ఫోటోలు, చైతన్యతో కలిసి దిగిన పిక్స్‌ డిలీట్‌ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది.

అన్ని ఫోటోలు తొలగించిన నిహారిక ఒక్కటి మాత్రం అలాగే ఉంచేసింది. ఇందులో పెళ్లి మండంలో చైతన్య పక్కనే ఉంది నటి. కాకపోతే అందులో చైతన్యను కొంత బ్లర్‌ చేసినట్లుగా ఉంది. 'నా దగ్గర ఓ రహస్యం ఉంది. కానీ మీకు చెప్పేస్తే అది సీక్రెట్‌ ఎలా అవుతుంది? సారీయే, చెప్పలేను' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఈ ఒక్క ఫోటో మాత్రం ఎందుకు అలాగే ఉంచేశావ్‌? మర్చిపోయావా? అని ఆరా తీస్తున్నారు. ఇకపోతే నిహారిక తన పెళ్లి వేడుకల్లో చైతన్యతో కాకుండా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సైతం అలాగే ఉంచేసింది.

కాగా 2020 ఆగస్టు 13న చైతన్య, నిహారికల నిశ్చితార్థం జరిగింది. కరోనా కారణంగా పెళ్లి కొంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అదే ఏడాది డిసెంబర్‌ 9న వీరు పెళ్లిపీటలెక్కారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)