Breaking News

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!

Published on Sun, 09/03/2023 - 08:39

ప్రముఖ అమెరికన్ సింగర్, గేయరచయిత జిమ్మీ బఫ్ఫెట్ (76) కన్నుమూశారు. ఆయన 'మార్గరీటవిల్లే', 'ఫిన్స్' వంటి హిట్ పాటలకు ప్రసిద్ధి చెందారు. సెప్టెంబర్ 1 రాత్రి ఆయన మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే జిమ్మీ మరణానికి గల కారణాలు వెల్లడికాలేదు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

(ఇది చదవండి: తెలుగు హీరోతో సినిమా వదులుకున్న స్టార్‌ హీరోయిన్.. తగిన శాస్తే జరిగింది!)

జిమ్మీ బఫెట్ 25 డిసెంబర్ 1946న అమెరికాలోని మిస్సిస్సిప్పిలో జన్మించారు. అతను 50 సంవత్సరాల తన కెరీర్‌లో దాదాపు 27 స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేశాడు. 1977లో విడుదలైన 'మార్గరెట్ విల్లే' ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బఫెట్ సింగర్‌ మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా. చాలా పుస్తకాలు రచించడమే కాకుండా పలు సినిమాలు, టీవీ షోలలో అతిథి పాత్రల్లో కనిపించాడు.

1981లో మాజీ ఫ్లోరిడా గవర్నర్ రాన్ గ్రాహంతో కలిసి సేవ్ ది మనాటీ క్లబ్ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించాడు. మిస్టర్ బఫెట్ 2016లో ఫోర్బ్స్ అమెరికా సంపన్నుల జాబితాలో 550 మిలియన్ డాలర్ల నికర విలువతో 13వ స్థానంలో నిలిచారు. కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం ఉన్నారు.

(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే! )

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి