Breaking News

రూ.1656 కోట్లతో భవంతిని కొన్న స్టార్‌ సింగర్స్‌.. స్పెషల్‌ ఏంటంటే..

Published on Mon, 05/22/2023 - 10:57

అమెరికన్‌ పాప్‌ స్టార్‌ సింగర్స్‌ బియాన్స్‌,  జే-జెడ్ జంట తాజాగా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. కాలిఫోర్నియాలోని మలిబులో ఉన్న విలాసవంతమైన ఆ భవనం విలువ దాదాపు 200 మిలియన్ల డాలర్స్‌ అని తెలుస్తోంది. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో దాదాపు 1656 కోట్ల రూపాయలు అన్నమాట. కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భవనం ఇదేనట. జపాన్‌కు చెందిన టడావో ఆండో అనే ఆర్కిటెక్ట్‌ డిజైన్‌ చేసిన ఈ భవంతిలో సకల సౌకర్యాలు ఉన్నాయాట.  

సినిమా గది... నాలుగు బహిరంగ స్విమ్మింగ్ పూల్స్ .. బాస్కెట్ బాల్ కోర్ట్‌ పాటు గాజు గోడలు .. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలతో ఈ భవనాన్ని నిర్మించారట. ఈ భవంతి నుంచే అదే ప్రాంతంలో ఉన్న పసిఫిక్‌ మహా సముద్ర బీచ్‌ అందాలను కూడా వీక్షించవచ్చునట. 20 ఏళ్ల కింద 14.5 మిలియన్ల డాలర్లకు విలియం బెల్ అనే వ్యక్తి ఈ భవనాన్ని కొనుగోలు చేశాడు.

ఆ తర్వాత  ఆర్కిటెక్ట్ టడావో‌తో దీనిని డిజైన్ చేయించారు. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ భవనం ఎల్‌ ఆకారంలో ఉంటుంది. 15 ఏళ్ల పాటు భవనంలో మార్పులు, చేర్పులు చేయించి మరింత అద్భుతంగా తీర్చి దిద్దారు. అందుకే బియాన్స్‌-జే జెడ్ జంట దాదాపు 200 మిలియన్ల డాలర్స్‌ పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఇదే కాకుండా మరో ఖరీదైన బంగ్లా కూడా ఈ జంటకు ఉంది. 2017లో లాస్‌ ఏంజెలెస్‌లో 88 మిలియన్ల డాలర్లతో ఓ భారీ బంగ్లాను కొనుగోలు చేశారు. 

(చదవండి: బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)