Breaking News

కోర్టులో లొంగిపోయిన హీరోయిన్ అమీషా పటేల్!

Published on Sun, 06/18/2023 - 14:40

ఆమె తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం హిందీ, పంజాబీలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గానే 'గదర్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇలా కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ‍్బందులు పడుతోంది. తాజాగా ఓ కేసు విషయమై కోర్టులో లొంగిపోయింది. 

2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. హిందీ, తెలుగులో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అ‍ప్పటినుంచి ఇప్పటివరకు అడపాదడపా మూవీస్ చేస్తూ వస్తోంది. కొన్నేళ్ల ముందు ఓ సినిమా విషయమై ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అజయ్ కుమార్ దగ్గర రూ.2.5 కోట్ల వరకు డబ్బు తీసుకుంది. ఆ తర్వాత సదరు సినిమా పూర్తి చేయలేదు సరికదా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. ఓసారి చెక్ ఇస్తే అది బౌన్స్ అయింది. దీంతో అజయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఈమెపై పోలీస్ కేసు నమోదు చేశారు.

ఈ కేసు విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్ కు కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో రాంచీలోని సివిల్ కోర్టులో ఈమె శనివారం లొంగిపోయింది. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ భామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన టైంలో తలకు పూర్తిగా ముసుగు వేసుకుని మీడియా ప్రతినిధుల నుంచి ముఖం దాచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)