Breaking News

రూ.100 కోట్లిచ్చినా ఆ పాత్ర చేయను: హీరోయిన్‌

Published on Sun, 12/22/2024 - 12:55

గతేడాది బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా నిలిచిన చిత్రాల్లో గదర్‌ 2 ఒకటి. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల మేర రాబట్టింది. అయితే ఈ సినిమాలో అత్త పాత్ర పోషించేందుకు హీరోయిన్‌ అమీషా పటేల్‌ అస్సలు ఒప్పుకోలేదంటున్నాడు డైరెక్టర్‌ అనిల్‌ శర్మ.

అమీషా ఒప్పుకోలేదు
ఓ ఇంటర్వ్యూలో అనిల్‌ శర్మ మాట్లాడుతూ.. vఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం కావాలి. తన ఇమేజ్‌ ఎక్కడ పాడవుతుందో అని భయపడింది. అయినా అమీషాపై నాకెలాంటి కోపం లేదు, తను కూడా గదర్‌ సినీ ఫ్యామిలీలో ఒక భాగమే! అని చెప్పుకొచ్చాడు.

అది నా ఇష్టం
ఈ వ్యాఖ్యలపై హీరోయిన్‌ అమీషా పటేల్‌ మండిపడింది. డియర్‌ అనిల్‌ గారు. ఇది సినిమా మాత్రమే, వ్యక్తిగత జీవితం కాదు! కాబట్టి ఏ సినిమాలు చేయాలి? ఎటువంటి పాత్రలు పోషించాలి? అనేది పూర్తిగా నా ఇష్టం. మీపై నాకు పూర్తి గౌరవం ఉంది. అయితే రూ.100 కోట్లు ఇచ్చినా సరే.. గదర్‌ సినిమాలోనే కాదు మరే సినిమాలోనూ అత్త పాత్ర పోషించలేను అని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా క్లారిటీ ఇచ్చింది.

గతంలోనూ వివాదం
కాగా గదర్‌ ఫస్ట్‌ పార్ట్‌లో సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. సీక్వెల్‌లో హీరో ఉత్కర్ష్‌ శర్మకు సన్నీ- అమీషా తల్లిదండ్రులుగా యాక్ట్‌ చేశారు. డైరెక్టర్‌ అనిల్‌ శర్మ తనయుడే ఉత్కర్ష్‌ శర్మ. గతంలోనూ అమీషా.. అనిల్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. గదర్‌ 2 షూటింగ్‌లో తనకు కనీస వతి కల్పించలేదని ఆరోపించింది. అలాగే కుమారుడి పాత్రను పవర్‌ఫుల్‌గా మార్చడం కోసం సినిమా క్లైమాక్స్‌నే మార్చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజులకే  డైరెక్టర్‌తో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేసి ఈ వివాదానికి ముగింపు పలికింది.

చదవండి: ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)