Breaking News

నా తల్లి ముందే అలాంటి బూతులు వినాల్సి వచ్చింది: అమర్‌

Published on Thu, 01/11/2024 - 13:08

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్‌లో అమర్‌, శోభ,ప్రియాంక (SPY) ఒక బ్యాచ్‌లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్‌, యావర్‌ (SPA) బ్యాచ్‌లో ఉన్నారు. ఈ రెండు బ్యాచ్‌ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్‌గా ప్రశాంత్‌ విన్నర్‌ అయితే.. అమర్‌ దీప్‌ రన్నర్‌ అయ్యాడు. కానీ చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్‌ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్‌ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్‌ బాస్‌ వల్ల ఆ అవకాశం దక్కింది అదే నాకు పెద్ద విజయం అని అమర్‌ పేర్కొన్నాడు.

బిగ్‌ బాస్‌ ఫైనల్‌ రోజున అమర్‌ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్‌ ఇలా తెలిపాడు. 'హౌస్‌ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కో అన్నారు... బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి..? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్‌ అయ్యాం. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చూట్టూ తిరుగుతూ ఫోన్‌ లైట్‌ ఆన్‌ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్‌ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు.. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు.

తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు.. వారందరి కోపం నామీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా..? ఓర్చోకోగలరా..? వారందరి మీదా నేనూ రియాక్ట్‌ కాగలను, కేసులు పెట్టగలను కానీ వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను..? అదొక గేమ్‌ మాత్రమే.. హౌస్‌లో కొందరు నన్ను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను.. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను.. బ్యాక్‌ బిచింగ్‌ చేయలేదు. అని అమర్‌ తెలిపాడు.

అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్‌ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని.. అందులో ఒక మెకానిక్‌గా పనిచేస్తాడని  అమర్‌ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' లో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)