Breaking News

ఖైదీ సీక్వెల్‌లో అమలాపాల్‌

Published on Sun, 04/06/2025 - 07:02

కోలీవుడ్‌ నటుడు కార్తీ కథానాయకుడుగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఖైదీ. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్సార్‌ ప్రకాష్‌ బాబు, ఎస్సార్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. కాగా త్వరలో ఈ చిత్రానికి సీక్వల్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఖైదీ చిత్రాన్ని హిందీలో నటుడు అజయ్‌ దేవగన్‌ 'భోలా' పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, అక్కడ కూడా ఫర్వాలేదనిపించింది.  తమిళం కార్తీ కథానాయకుడిగా నటించిన పాత్రను హిందీలో అజయ్‌ దేవగన్‌ పోషించారు. నరేన్‌ పాత్రలో నటి టబు కనిపించారు.

అజయ్‌ దేవగన్‌ ఫిలిమ్స్‌ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నటి అమలాపాల్‌ కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను బాలీవుడ్‌లో కూడా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను యూనిట్‌ వర్గాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా 2009లో మలయాళంలో నీలతామర అనే చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అమలాపాల్‌ తమిళంలో వీరశేఖరన్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలా మలయాళం ,తమిళం, తెలుగు భాషల్లోనూ ప్రముఖ హీరోల సరసన కథానాయకగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు మనస్పర్ధల కారణంగా రెండేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలో నటించడం మొదలెట్టిన అమలాపాల్‌ అదేవిధంగా జగత్‌ దేశాయ్‌ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒక పాప కూడా పుట్టింది. కాగా అమలాపాల్‌ నటించిన మలయాళ చిత్రం గోట్‌ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆమె తమిళంలో నటించి చాలా కాలమే అయ్యింది. కాగా తాజాగా బాలీవుడ్‌లోకి ఖైదీ2తో మరోసారి సందడి చేయనున్నారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)