Breaking News

జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైంది: స్టార్‌ హీరోయిన్‌

Published on Sat, 02/28/2026 - 07:09

నటి అమలాపాల్‌ గుర్తుందా ? ఆమెను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. కారణం అంతగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన నటి ఈ బ్యూటీ. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రముఖ నటులతో జతకట్టిన అమలాపాల్, అంతకంటే ఎక్కువగా వివాదాస్పద నటిగా ముద్ర వేసుకున్నారు. ఈమె ప్రేమ, పెళ్లి అంతా సంచలనమే. స్టార్‌గా రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. రెండేళ్లు తిరక్కుండానే విడాకులు పొందారు. ఆ తర్వాత అమలాపాల్‌ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. 

అదేవిధంగా నిర్మాతగానూ రంగ ప్రవేశం చేశారు. అలా కొద్ది కాలం తర్వాత మరో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యారు. తన రెండవ పెళ్లి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమలాపాల్‌ మాట్లాడుతూ మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటానని అనుకోలేదన్నారు. జీవితం నిస్సారంగా సాగిపోతున్న తరుణంలో ఒక జ్యోతిష్కుడిని కలిశానన్నారు. ఆయన తనకు 32 ఏళ్ల వయసులో పెళ్లి జరుగుతుందని చెప్పాడన్నారు. 

జ్యోతిష్యుడు చెప్పిన కొద్దిరోజుల తర్వాత జగత్‌ అనే వ్యక్తిని గోవాలో కలుసుకున్నానన్నారు. మొదట్లో తాము డేటింగ్‌ చేశామని, అలా  గర్భం దాల్చినట్లు చెప్పుకొచ్చారు. అప్పటికీ కూడా తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదన్నారు. అయితే గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే కదా! అనిపించడం వల్ల జగత్‌తో తన వివాహం జరిగిందని ఆమె అన్నారు. ఈమె చివరగా నటించిన మలయాళ చిత్రం  ది గోట్‌ చిత్రం 2024లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె మరో చిత్రంలో నటించలేదు. అయినా ఈ అమ్ముడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటున్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)