Breaking News

ఆధ్యాత్మిక బాటలో అమలాపాల్‌, వీడియో వైరల్‌

Published on Sun, 02/19/2023 - 11:10

వివాదాలకు చిరునామా అమలాపాల్‌. నటన, ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాలు, ఆరోపణలు, కేసులతో ఆమె నిత్యం సావాసం చేస్తుంటారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా నటించి గుర్తింపు పొందారు. తమిళంలో మైనా చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఈమె ఆ తరువాత ప్రముఖ హీరోల సరసన నటించారు. అదేవిధంగా నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్లలోనే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నటిగా కొనసాగుతున్న అమలాపాల్‌ ఆ మధ్య నిర్మాతగానూ మారి కడావర్‌ అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా నటిగా క్రేజ్‌ తగ్గడంతో తాజాగా ఆధ్యాత్మిక బాట పట్టినట్లు తెలుస్తోంది.

క్రిస్టియన్‌ మతానికి చెందిన అమలాపాల్‌ ఇటీవల కేరళలోని ఓ హిందూ దేవాలయానికి వెళ్లారు. అయితే అక్కడి అర్చకులు. ఆలయ నిర్వాహకులు అనుమతించకపోవడంతో భంగపడ్డారు. కానీ తన ఆధ్యాత్మిక పర్యటనను మాత్రం ఆపలేదు. ఇటీవల తమిళనాడులోని పళని కుమారస్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం అమలాపాల్‌ ఇండోనేషియాలోని బాలి దీవికి వెళ్లి అక్కడ ఓ ఆశ్రమంలో బస చేశారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ యోగా ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని అమలాపాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)