Breaking News

ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్‌ గెస్ట్‌ ఎవరంటే..?

Published on Mon, 03/09/2026 - 07:17

అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రతిష్టాత్మక మ‌ల్టీప్లెక్స్‌ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం కానుంది.  హైదరాబాద్‌లోని కోకాపేటలో  ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. సినీ అభిమానులకు అత్యాధునిక సదుపాయాలతో లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, ఐమ్యాక్స్ స్థాయి విజువల్స్ వంటి ప్రపంచ స్థాయి సాంకేతికతతో అల్లు అరవింద్‌ దీనిని నిర్మించారు. అయితే, ఈ థియేటర్‌కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్‌ పాత్ర ఐకానిక్‌గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్‌ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది.

అయితే, ‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవం మాత్రం మార్చి 12న జరగనుందని తెలుస్తోంది. ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నట్లు సమాచారం. సీఎం చేతులమీదుగా అల్లు సినిమాస్‌ ప్రారంభం కానుందని ఇప్పటికే సోషల్‌మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో మొదటి  ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ప్రదర్శించబడుతాయి. ఈ మల్టీఫ్లెక్స్‌లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉన్నాయి. ప్రతి స్క్రీన్‌లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ  స్క్రీన్‌ను ఏర్పాటు చేయడంతో హైదరాబాద్‌ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.

పుష్ప-2 విడుదల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత వారిద్దిరూ గద్దర​్‌ అవార్డ్స్‌ వేదికపై కలుసుకోవడంతో వాటికి బ్రేక్‌ పడింది. అల్లు శిరీశ్ పెళ్లి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మరోసారి కలిసిని విషయం తెలిసిందే.. వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఆలింగనం కూడా చేసుకున్నారు. కొంత సమయం పాటు ఒకే సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. అలా అల్లు ఫ్యామిలీతో మంచి బాండింగ్‌ ఏర్పడటంతో అల్లు సినిమాస్‌ ప్రారంభోత్సవానికి సీఎం తప్పకుండా వెళ్తారని బన్నీ ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)