Breaking News

అల్లు అర్జున్‌ మల్టీఫ్లెక్స్‌ ఓపెనింగ్‌ ఫిక్స్‌.. మొదటి సినిమా ఇదే..!

Published on Tue, 02/10/2026 - 08:02

మల్టీఫ్లెక్స్‌ థియేటర్స్‌ నిర్మించడంలో అల్లు అర్జున్‌ దూకుడుగా ఉన్నారు. హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా జోరు చూపిస్తున్నారు. మొదట మహేష్‌ బాబు ఏఎమ్‌బీతో ఈ ట్రెండ్‌ క్రియేట్‌ చేయగా.. ఈ తర్వాత బన్నీ, విజయ్‌ దేవరకొండ, రవితేజ అదే దారిలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా ఏషియన్ గ్రూప్స్‌తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అమిర్‌పేట్‌లో ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్‌ నిర్మించిన అల్లు అర్జున్‌ ఇప్పుడు అల్లు సినిమాస్‌ పేరుతో  వరల్డ్ క్లాస్ థియేటర్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.

అల్లు సినిమాస్‌ పేరుతో హైదరాబాద్‌లోని కోకాపేటలో  ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. ఈ థియేటర్‌లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు.  దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ  స్క్రీన్‌ను ఏర్పాటు చేయడంతో హైదరబాద్‌ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, 4 స్క్రీన్‌లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌ను మార్చి 19న  ప్రారంభించాలనే ఆలోచనలో అల్లు సినిమాస్‌ టీమ్‌ ఉన్నట్లు సమాచారం. 

ఇందులో తొలి సినిమాగా   'ధురంధర్ 2, టాక్సిక్‌'  ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు పాన్‌ ఇండియా సినిమాలు ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్‌ బ్రాండ్‌ విస్తరిస్తుందని ప్లాన్‌ చేస్తున్నారట.  హైదరాబాద్ సినీప్రియులకు  అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం అల్లు సినిమాస్‌తో లభించనుంది. విశాఖపట్నంలో కూడా అతిపెద్ద మల్టీఫ్లెక్స్‌ నిర్మాణ పనులను అల్లు అర్జున్‌ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)