Breaking News

కూతురి కోసం బన్నీ స్పెషల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్!

Published on Tue, 11/21/2023 - 13:53

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. 

అయితే సాధారణంగా సెలబ్రిటీల పిల్లల తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ ఒక అడుగు ముందే ఎప్పుడు ఉంటుంది. అలాగే బన్నీకి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరిద్దరిలో అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. సమంత నటించిన శాకుంతలం చిత్రంలో మెరిసింది. భరతుడిగా నటించి సిల్వర్‌ స్క్రీన్‌పై రాజసాన్ని పండించి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇవాళ తన పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలిపారు. తన ఇన్‌స్టాలో అల్లు అర్హతో ఉన్న ఫోటోను పంచుకున్నారు.

బన్నీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' హ్యాపీ బర్త్‌ డే మై లిటిల్ ప్రిన్సెస్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్‌ చూసిన కల్యాణ్ దేవ్, గీతూ రాయల్, పీవీ సింధు బర్త్ డే విషెస్ తెలిపారు. కాగా.. అల్లు అర్హ.. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనున్నట్లు సమాచారం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)