Breaking News

నా అభిమానులకు అంకితమిస్తున్నా.. ఐకాన్ స్టార్ ట్వీట్

Published on Sun, 11/02/2025 - 16:33

ప్రతిష్టాత్మక అవార్డ్‌ను తన అభిమానులకు అంకితమిస్తున్నానని అల్లు అర్జున్‌ ట్వీట్ చేశారు. ఇలాంటి ‍అరుదైన గౌరవమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారికి హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఐకాన్ స్టార్ ట్వీట్‌ చేశారు. 2024 ఏడాదిగానూ ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ‍అవార్డులను తాజాగా ప్రకటించారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మోస్ట్ వర్సటైల్ యాక్టర్‌ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.  అంతేకాకుండా పుష్ప-2 మూవీకి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ అవార్డ్‌ దక్కించుకున్నారు. ఈ అవార్డ్స్‌లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా సత్తా చాటింది. దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ -2025లో ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది. గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని భయంతో పరుగులు పెట్టించిన శ్రద్దాకపూర్ మూవీ స్త్రీ- 2 ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది.

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటీనటులుగా కార్తీక్‌ ఆర్యన్, కృతి సనన్‌ నిలిచారు. చందు ఛాంపియన్‌ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా కబీర్‌ ఖాన్, ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా దినేశ్‌ విజన్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు. క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ చిత్రంగా లాపత్తా లేడీస్‌, ఉత్తమ నటీనటులుగా విక్రాంత్‌ మాస్సే, నితాన్షీ గోయెల్‌ అవార్డులు దక్కించుకున్నారు. ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఏఆర్‌ రెహమాన్ నిలిచారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)