Breaking News

రాకా రెండు భాగాలుగా రాక?

Published on Fri, 07/31/2026 - 00:39

‘రాకా’ సినిమా రెండు భాగాలుగా రానుందా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ లీడ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారట.

తండ్రి...ఇద్దరు కొడుకులు... ఇలా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట అల్లు అర్జున్‌. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ ముంబైలోని ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. తాజాగా, ఈ సినిమా గురించిన ఓ అంశం తెరపైకి వచ్చింది. ‘రాకా’ను రెండు భాగాలుగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ఈ అంశానికి సంబంధించి ఇటీవలే అల్లు అర్జున్, అట్లీ అండ్‌ టీమ్‌ చర్చించుకున్నారని, ‘రాకా’ను రెండు భాగాలుగా రిలీజ్‌ చేయాలనే నిర్ణయం తీసుకున్నారని భోగట్టా. 

అంతేకాదు... రెండు భాగాల చిత్రీకరణను ఒకేసారి పూర్తి చేసి, పెద్ద గ్యాప్‌ లేకుండా వెంట వెంటనే రిలీజ్‌ చేయాలన్నది అట్లీ ప్లాన్‌ అని సమాచారం. అలాగే ఈ ఏడాదిలోపే షూటింగ్‌ను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)