Breaking News

పవన్‌ కల్యాణ్‌కి విషెస్‌ చెప్పని బన్నీ, కారణమిదేనా?

Published on Sat, 09/03/2022 - 20:09

తెలుగు సినీ పరిశ్రమలో​ మెగా-అల్లు ఫ్యామిలీలకు ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. ఈ రెండు కుటుంబాలు ఒక్కచోట కనిపిస్తే ఫ్యాన్స్‌కు కన్నుల పండగే. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మెగా ఇంట్లో ఎలాంటి సెలబ్రెషన్స్‌ అయిన అల్లు ఫ్యామిలీ మొత్తం అక్కడ వాలిపోతుంది. అయితే ఈ మధ్య వారు కలిసి ఎక్కడ కనిపించడం లేదు. చిరంజీవి బర్త్‌డే వేడుకలో బన్నీ కొడుకు తప్పా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరూ కనిపించకపోవడంతో మరోసారి ఈ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. 

చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి

ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్‌ ఈ వార్తలపు ఖండించారు. మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉందని, తమ కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎవరి స్టార్‌డమ్‌ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే అని ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తాజాగా బన్నీ తీరు చూసి కొందరు మరోసారి వీరి బంధుత్వం చెడిందా? అనే సందేహాలను లేవనేత్తున్నారు. దీనికి కారణం శుక్రవారం(సెప్టెంబర్‌ 2) పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డేకు అల్లు అర్జున్‌ విష్‌ చేయకపోవడమే. 

చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ రిలీజ్‌కు ఇంకా 6 రోజులే.. అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రాజమౌళి

చిరంజీవి బర్త్‌డేకు విష్‌ చేసిన అల్లు అర్జున్‌ మరి పవన్‌కు ఎందుకు విషెస్‌ చెప్పకపోవడం ఈ వార్తలకు మరోసారి ఆజ్యం పడింది. ఒక్క బన్నీ మాత్రమే కాదు అల్లు శీరిష్‌ కానీ, బన్నీ భార్య స్నేహా రెడ్డి సైతం పవన్‌ కల్యాణ్‌ని విష్‌ చేస్తూ ఎలాంటి పోస్ట్‌ పెట్టలేదు. దీంతో మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నా మాటే నిజమేనా? అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రెండు రోజుల క్రితమే ఈ వార్తలపై అల్లు అరవింద్‌ క్లారిటీ ఇచ్చిన బన్నీ విష్‌ చేయకపోవడంతో ఈ అంశం మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. మరి ఇక దీనిపై అల్లు అర్జున్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)