Breaking News

అల్లు అర్జున్‌ మనసులో రాఘవేంద్రరావు స్థానం.. ఫోటో వైరల్‌

Published on Fri, 05/23/2025 - 21:20

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ తన తొలి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారిపట్ల ఎంతో గౌరవం, కృతజ్ఞతతో ఉంటాడు. తనను హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నిత్యం తలచుకునేలా, తన సినీ ప్రయాణం ప్రారంభమైన దశను ప్రతిరోజూ గుర్తు చేసుకునేలా, అల్లు అర్జున్ తన కార్యాలయ ప్రవేశద్వారంలో రాఘవేంద్రరావు ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా దర్శకుడిపై తన గౌరవాన్ని చాటుకున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ విజయాలమీద మాత్రమే కాకుండా, తనకు మద్దతుగా నిలిచిన వారిపట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే విషయంలో కూడా ఎంతో విలువలతో ఉంటాడు. ఈ విషయంలో ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమైనది.  రాఘవేంద్రరావు తనను సినిమారంగంలోకి పరిచయం చేసిన తొలి దర్శకుడిగా, ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

"అల్లు అర్జున్ తన కెరీర్‌ ఎదుగుదలకు తోడ్పడిన దర్శకుల విషయంలో ఎంతో జెన్యూన్‌ ప్రేమతో ఉంటాడు. వాళ్ల పట్ల ఎప్పుడూ ఆయన మనసులో ఎంతో గౌరవం ఉంటుంది.  అందులో రాఘవేంద్రరావుకు బన్నీ జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.  తన దర్శకులు, సాంకేతిక నిపుణులు, చిత్రబృందంలోని ఇతర సభ్యుల పట్ల అల్లు అర్జున్ గల గాఢమైన భావోద్వేగ బంధం గురించి ఆయన తరచూ మాట్లాడుతుంటారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిదశలో ఆయనకు సహాయపడిన వారిని ఆయన ఎప్పటికీ మరిచిపోరు అని పలువురు అంటున్నారు.

అల్లు అర్జున్ కార్యాలయం ప్రవేశద్వారంలో ఉన్న రాఘవేంద్రరావు చిత్రపటం ఆయనలో ఉన్న కృతజ్ఞత, గౌరవం, భావోద్వేగ సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విలువలే ఆయన విజయాలకు పునాది మాత్రమే కాకుండా, స్టార్‌గా కాకుండా వ్యక్తిగా కూడా ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి అని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)