Breaking News

పుష్ప-2 స్పెషల్ షో.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్..!

Published on Fri, 12/05/2025 - 16:31

ఐకాన్ స్టార్ అ‍ల్లు అర్జున్‌ హీరోగా గతేడాది ఇదే రోజు రిలీజైన చిత్రం పుష్ప-2. ఈ మూవీ డిసెంబర్‌ 2, 2024న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇందుకోసం బాలానగర్‌లో విమల్ థియేటర్‌లో షో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్‌ వద్ద బన్నీ ఫ్యాన్స్‌ గొడవ పడ్డారు.

అయితే ఈ షో టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్‌ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్‌ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంధ్య థియేటర్‌ ఘటన..

పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్‌ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్‌ ఇండస్ట్రీ అండగా నిలిచింది. ప్రస్తుతం శ్రీతేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాుడు.

 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)