హైదరాబాద్‌లో సమావేశమైన 'అల్లు అర్జున్' ఫ్యాన్స్

Published on Sun, 02/08/2026 - 21:12

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు.  రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్  అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై తాజాగా చర్చించారు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని  అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు.

టాలీవుడ్‌లో ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్‌ ఉన్నాయి.  కొన్నేళ్లుగా ఈ అసోసియేషన్స్‌ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్‌ లేరనే చెప్పాలి. ఆ సమయంలో తను చెప్పాలనుకున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యాడు. బన్నీ తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్‌ చేసేవారు లేరు.  అందుకే ఫ్యాన్స్‌ కొరతను ఆయన గ్రహించారని తెలుస్తోంది.

Videos

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్

Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు

చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?

సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్, శ్రీకాంతాచారి

గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!

వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

డొల్ల కంపెనీలతో బిగ్ స్కామ్.. OTP లేకుండానే 5 వేల కోట్లు..

లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..

Photos

+5

గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్‌.. నెట్టింట ఫోటోలు వైరల్‌

+5

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)

+5

కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్‌ జగన్‌ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్‌, తేజ సజ్జా (ఫోటోలు)

+5

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)